అశ్వాపురం మండలంలో శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు పర్యటన: అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అశ్వాపురం, ఆధాబ్ న్యూస్:
శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అశ్వాపురం మండలంలో పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కళ్యాణపురం, మిట్టగూడెం, బట్టీల గుంపు, అమ్మగారిపల్లి, జగ్గారం, అమేర్ధ పంచాయతీల పరిధిలో సుమారు రూ. 1 కోటి అంచనా వ్యయంతో నిర్మించిన CC రోడ్లు మరియు ఇతర అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ప్రజల ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని మండలంలో రోడ్ల నిర్మాణం సహా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో మండలం ముందంజలో ఉంది,” అని తెలిపారు.
ప్రతి గ్రామానికీ మరింత అభివృద్ధిని తీసుకురావడం లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. గ్రామస్తులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును అభినందిస్తూ, వారి సహకారం వల్ల గ్రామాల్లో వాడ వాడకూ అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









