ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఇంకెన్నాళ్లు మాయమాటలు? చర్లలో కాంగ్రెస్‌పై బీఎస్పీ తీవ్ర విమర్శలు

ఇంకెన్నాళ్లు మాయమాటలు? చర్లలో కాంగ్రెస్‌పై బీఎస్పీ తీవ్ర విమర్శలు
చర్ల,ఆధాబ్ న్యూస్:
చర్ల మండల కేంద్రంలోని బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల నాయకుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. పార్టీ సీనియర్ నేత సామల ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీఎస్పీ మండల అధ్యక్షుడు కొండా చరణ్ మాట్లాడుతూ, “ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించాలని” పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో చర్ల గ్రామస్థులైన చీపురు మణికంఠ, అంకాల లక్ష్మణరావు లను బీఎస్పీలోకి ఆహ్వానిస్తూ, పార్టీ మండల ఈసీ మెంబర్ గుర్రాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కండువా కప్పి పార్టీలోకి చేర్చారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున మాట్లాడిన కొండా చరణ్, “బీఎస్పీలో చేరిన ఈ కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుంది,” అని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు
కొండా చరణ్ మాట్లాడుతూ, “ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. కోరెగడ్డ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వలేదు. వరద బాధితులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. చర్లలో డిగ్రీ, మెడికల్ కాలేజీలు ప్రారంభించలేకపోయారు. వద్దిపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తికాలేదు,” అని ఆరోపించారు.

అలాగే చర్ల మండల కేంద్రంలో అదనపు ట్యాంకు నిర్మాణం పూర్తి కాలేదని, పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదని, వలస ఆదివాసులకు ST కుల సర్టిఫికెట్లు అందలేదని, ఈత వాగు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం జరగలేదని గుర్తుచేశారు. యువతకు నిరుద్యోగ భృతి, 4 వేల రూపాయల పింఛన్లు కూడా అందలేదని విమర్శించారు.

ఇందిరమ్మ ఇళ్లపై తీవ్ర విమర్శలు
ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఎన్నికల ఎత్తుగడలో భాగమేనని, ఆ లిస్టులో పారదర్శకత లేదని పేర్కొన్నారు. “అర్హులు లేని వారు అధికార పార్టీ అండతో ఇళ్లు పొందారు. నిజమైన అర్హులకు మొదటి దఫాలో అవకాశం రాలేదు,” అని పేర్కొన్నారు.

బీఎస్పీ ప్రభుత్వమే మార్గం
చివరిగా చర్ల మండల అభివృద్ధి కోసం బీఎస్పీకే ప్రజలు అధికారం ఇవ్వాలని కొండా చరణ్ పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ కార్యదర్శి కొండా కౌశిక్, నాయకులు గోగికార్ రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!