ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మణుగూరులో మెగా లోక్ అదాలత్ – న్యాయ సేవలపై అవగాహన పెంపుపై దృష్టి

మణుగూరులో మెగా లోక్ అదాలత్ – న్యాయ సేవలపై అవగాహన పెంపుపై దృష్టి

మణుగూరు,ఆధాబ్ న్యూస్: మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో మణుగూరులోని జుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టులో శనివారం మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ లోక్ అదాలతలో జడ్జి కంభంపు సూరి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బద్దం శ్రీనివాసరెడ్డి, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
జడ్జి సూరి రెడ్డి మాట్లాడుతూ, “లోక్ అదాలత్‌ల ద్వారా న్యాయ సంబంధిత వివాదాలు త్వరగా పరిష్కారమవుతాయి. దీని వల్ల ప్రజలకు సమయం, ధనం మరియు శ్రమను ఆదా చేయగలుగుతారు,” అన్నారు. అలాగే, లీగల్ సర్వీసెస్ ప్రాధాన్యతను వివరిస్తూ ప్రతి పౌరుడూ న్యాయం పొందే హక్కు ఉందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు ప్రజలకు న్యాయ సేవలపై అవగాహన కల్పిస్తూ వివిధ అంశాలపై చర్చించారు. వివిధ పౌర మరియు క్రిమినల్ కేసులు, ఆస్తి వివాదాలు, రుణాలు, ట్రాఫిక్ జరిమానాలు వంటి అనేక కేసులు ఉమ్మడి రాజీ ద్వారా పరిష్కరించారు.

ప్రజల భాగస్వామ్యం ద్వారా ఈ లోక్ అదాలత్ విజయవంతంగా కొనసాగినట్టు నిర్వాహకులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!