కరకగూడెంలో మండలంలో ఉరుములుతో మోస్తరు వర్షం
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండల వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నీలి ఆకాశాన్ని మేఘాలు కమ్ముకొని, ఉరుములతో కూడిన వర్షపు జల్లులు కురుస్తూ చల్లని వాతావరణాన్ని తెచ్చాయి. గత కొన్ని రోజులుగా మండే ఎండలు, ఉక్కపోతతో విసిగిపోయిన ప్రజలకు ఈ వాన కొంత ఉపశమనాన్ని కలిగించింది.
వేగంగా మారిన వాతావరణం, ఉరుములతో కురిసిన వర్షం మండలంలోని కరకగూడెం, సహా పలు గ్రామాల్లో చల్లదనాన్ని తీసుకొచ్చింది. ప్రజలు ఎండల నుంచి తక్షణ ఉపశమనం పొందారు.
Post Views: 104









