అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంపై సోషల్ మీడియా అధ్యక్షులు సిద్ధి సునిల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం – బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదానికి దారితీసింది. ఈ విషాదకర ఘటనపై కరకగూడెం మండల బిఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షుడు సిద్ది సునిల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో 169 మంది భారత పౌరులు, 53 మంది ఇంగ్లాండ్ పౌరులు, 7 మంది పోర్చుగల్ పౌరులు, ఒక కెనడా పౌరుడు, 12 మంది విమాన సిబ్బంది మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన సునిల్, “ఇది ఒక అత్యంత విషాదకరమైన, దురదృష్టకరమైన సంఘటన. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి,” అని కోరారు.
ప్రమాదానికి కారణాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, పునరావాస ఏర్పాట్లు కూడా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.









