చెరువుల దుర్వస్థితిపై చర్యలు తీసుకోవాలని టిడిపి నేత చందా మధు
కరకగూడెం, ఆధాబ్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
టిడిపి నియోజకవర్గ నాయకుడు చందా మధు ఆధ్వర్యంలో కరకగూడెం మండలంలోని చెరువుల సమస్యలపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాయినిపేట గ్రామంలోని చిర్రకుంట చెరువు గతంలో గండి పడినప్పటికీ ఇప్పటికీ శాశ్వత పరిష్కారం లేదని రైతులు తెలిపారు. తాత్కాలికంగా చేసిన మరమ్మతులతో సాగు కొనసాగుతున్నా, మరోసారి ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
వర్షాకాలం ప్రారంభమైందని గుర్తు చేసిన రైతులు, ప్రభుత్వం వెంటనే స్పందించి తూములు, షట్టర్లు, అలుగులు వంటి నిర్మాణాలను మరమ్మతు చేయాలని కోరారు. గంచర తోగు ముత్యాలమ్మ చెరువు, కొంగల చెరువు, చింతగండి చెరువు లు కూడా మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా
చందా మధు మాట్లాడుతూ, “రైతుల జీవితాధారంగా నిలిచే ఈ చెరువులు పట్ల ప్రభుత్వం శ్రద్ధ చూపాలి. అధికారుల్ని పంపించి సమస్యలను పరిష్కరించాలి,” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో తాటి సతీష్, కాలం నాగేశ్వరరావు, పాయం సమయం, కాలం ఇస్తారి, చెరపకొమ్మాలు తదితరులు పాల్గొన్నారు.









