కరకగూడెం,ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ఇప్పచెట్టు గుంపు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడు దుర్గం కిరణ్ ఇంటి నిర్మాణానికి సంబంధించి భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ,
ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చినది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమే అని చెప్పారు. పేద ప్రజలకు న్యాయం జరగాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, పినపాక నియోజకవర్గ శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు గాంధర్ల రామనాథం, దుర్గం కన్నయ్య, కార్యకర్తలు, గ్రామస్థులు, మహిళలు, యువకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









