కరకగూడెంలో ఎక్సైజ్ విభాగం విస్తృత తనిఖీలు – నిషేధిత గుడుంబా తయారీకి ఉపయోగించే పదార్థాలు స్వాధీనం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో ఎక్సైజ్ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ సీఐ రాజిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీల్లో 15 క్వింటాళ్ల బెల్లం, 10 కేజీల పటిక మరియు 10 లీటర్ల తయారు చేసిన గుడుంబాను అధికారులు పట్టుకున్నారు. ఈ గుడుంబా తయారీకి ఉపయోగించే పదార్థాలు క్రమబద్ధమైన రూపంలో నిల్వ ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
ఈ ఘటనలో ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎక్సైజ్ సీఐ రాజిరెడ్డి తెలిపారు. నిషేధిత మద్యం తయారీ మరియు సరఫరాపై చర్యలు మరింత కఠినంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.
ప్రాంత ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలను గమనించినా అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.









