గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు భారంగా మారిన నేపథ్యంలో ఎంపీఓకు తాళాల అప్పగింత
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: కరకగూడెం పరిధిలోని 16 గ్రామ పంచాయతీల కార్యదర్శులు, గ్రామ పంచాయతీల ట్రాక్టర్లు ఆర్థికంగా భారంగా మారాయని పేర్కొంటూ ట్రాక్టర్ల తాళాలను ఎంపీడీఓ మారుతికి అప్పగించారు.
కార్యదర్శులు పేర్కొనడంతో, గత ప్రభుత్వం చెత్త సేకరణ కోసం సరఫరా చేసిన ట్రాక్టర్లు ప్రస్తుతం పెద్ద మొత్తంలో నిర్వహణ ఖర్చును తెచ్చిపెడుతున్నాయని, ఇంధనం, మరమ్మతులు, డ్రైవర్ ఖర్చులతో పంచాయతీలు అప్పుల్లోకి జారుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ట్రాక్టర్ల నిర్వహణ తమ వల్ల కాకపోవడంతో తాళాలను అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు.
“పంచాయతీల ఆర్థిక స్థితి దెబ్బతింటోంది. వ్యయభారం భరించలేని స్థితికి వచ్చాం,” అని వారు వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా 16 గ్రామ పంచాయతీలకు చెందిన కార్యదర్శులు పాల్గొన్నారు.
Post Views: 183









