ప్రతి క్షణం
ప్రజల పక్షం

  గోవిందరావుపేట తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి పొంగులేటి

గోవిందరావుపేట తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి పొంగులేటి

ములుగు,జూన్ ఆధాబ్,న్యూస్: ములుగు జిల్లా గోవిందరావుపేట మండల తహశీల్దార్ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. కార్యాలయపు నడుమ తనిఖీలు నిర్వహించి, కీలక రికార్డుల పరిశీలన చేశారు.

ఈ సందర్బంగా రెవెన్యూ సదస్సుల నిర్వహణ, భూ సమస్యల పరిష్కారాలపై తహశీల్దార్ మరియు ఆర్డీవో అధికారులతో మంత్రి చర్చించారు. ధరణి వ్యవస్థకు ముందు ఉన్న భూ రికార్డులను ప్రస్తుత రికార్డులతో పోల్చి, బోగస్ పట్టాదారులను గుర్తించి, వారు పొందిన రైతు బంధు నిధులను తిరిగి రికవరీ చేయాలని అధికారులను ఆదేశించారు. వినకపోయిన వారు ఉంటే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హెచ్చరించారు.

భూమి రికార్డులు అంటే పెద్దలు ఇచ్చిన ఆస్తి, వాటిని కాపాడుకుంటూ డిజిటలైజేషన్ పూర్తి చేయాలని సూచించారు. చిన్న తప్పులు జరిగినా అధికారులను ఉపేక్షించేది లేదని మంత్రి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్ పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్