ప్రతి క్షణం
ప్రజల పక్షం

  భద్రాచలం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు – శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు

భద్రాచలం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు – శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు

భద్రాచలం,ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ బుధవారం భద్రాచలం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను పరిశీలించి, విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా స్టేషన్ శుభ్రతపై దృష్టి పెట్టాలని, ప్రజలతో మర్యాదగా వ్యవహరించి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించే బాధితులకు న్యాయం అందించాల్సిన బాధ్యతపై ఆయన సూచనలు చేశారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు తెలుసుకుని, పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితంగా పరిష్కరించేందుకు చురుకుగా పనిచేయాలని తెలిపారు.

పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) జి. నరేందర్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్, ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్సైలు స్వప్న, రామకృష్ణ, శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!