ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పరిశుభ్ర పాఠశాలల కోసం శిక్షణ – కరకగూడెంలో మండల స్థాయి “స్వచ్ఛ మిత్రుల”కు మార్గదర్శనం

కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బుధవారం మండల స్థాయి “స్వచ్ఛ మిత్రులు” కు శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. కోర్స్ డైరెక్టర్ జి. మంజుల అధ్యక్షత వహించిన ఈ సమావేశాన్ని ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని 25 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, 3 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల స్వచ్ఛ మిత్రులకు శిక్షణ ఇవ్వడం ఎంతో అవసరమని, వారు పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలక బాధ్యత వహించాలన్నారు. పాఠశాలలో మొక్కలు పెంపకం, టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచడం, అలాగే ఖాళీ ప్రదేశాలను కిచెన్ గార్డెన్లుగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ శిక్షణ ఇవ్వబడినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల రిసోర్స్ పర్సన్‌లుగా జే. వెంకటేశ్వర్లు, బి. బావ సింగ్, కె. సూర్యనారాయణలతో పాటు మండల విద్యా కార్యాలయ సిబ్బంది గురువయ్య, జయబాబు, విష్ణుమూర్తి పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్