ప్రతి క్షణం
ప్రజల పక్షం

  చెస్ నాణేలను రికార్డు వేగంతో గుర్తించిన చిన్నారి గ్రీష్మిక ఖమ్మం జిల్లా గర్వంగా మిగిలిన ఘనత

చెస్ నాణేలను రికార్డు వేగంతో గుర్తించిన చిన్నారి గ్రీష్మిక
ఖమ్మం జిల్లా గర్వంగా మిగిలిన ఘనత

ఏన్కూరు (ఖమ్మం), జూన్ 11 ఆధాబ్ న్యూస్:
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలానికి చెందిన పిన్ని శ్రవణ్ కుమార్, పూజిత దంపతుల కుమార్తె గ్రీష్మిక అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి ప్రపంచ రికార్డు సాధించింది. వయసు చిన్నదే అయినా చైత్యం, చురుకుదనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

2 సంవత్సరాల 7 నెలల 3 రోజుల వయస్సులో గ్రీష్మిక, చెస్‌లోని అన్ని నాణేలను కేవలం 5 సెకన్లలో పఠించి, 8 సెకన్లలో గుర్తించి పఠించిన విశేష ప్రతిభతో గతంలో ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఘనతకు గాను గ్రీష్మికకు “చెస్ పీస్‌లను అత్యంత వేగంగా గుర్తించిన చిన్నారి (పసిపిల్లల విభాగం)” అనే ప్రపంచ రికార్డు లభించింది. ఈ ఘనతను 2025 మే 9న హైదరాబాద్‌లో ఆమె సాధించింది.

ఈ సందర్భంగా తల్లిదండ్రులు పూజిత, శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, “మా కూతురు గ్రీష్మిక చిన్ననాటి నుంచే బోధనాపట్ల ఆసక్తి చూపుతూ వస్తోంది. ఆమెకు అభినందనలు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. అలాగే పిన్ని వెంకటేశ్వర్లు దంపతులు, రోకటి సురేష్ దంపతులు, ఏన్కూరు మండల ప్రజలు, జూలూరుపాడు మండల ప్రజలు చిన్నారికి అభినందనలు తెలియజేశారు.

గ్రీష్మిక భవిష్యత్తులో మరెన్నో పతకాలు సాధించాలని, దేశానికి పేరు తెచ్చేలా ఎదగాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!