25 గంటల్లో ఐదు పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రత్యేక బస్సు సేవలు
భద్రాచలం నుంచి యాత్ర; టికెట్ ధర రూ.1500
భద్రాచలం,ఆధాబ్ న్యూస్: భక్తుల కోసం పుణ్యక్షేత్రాల దర్శనానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సేవలు ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో భక్తులు మొత్తం 25 గంటలలో ఐదు ప్రముఖ దేవాలయాలు సందర్శించనున్నారు.
ఈ బస్సు భద్రాచలం డిపో నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 10 గంటలకు తిరిగి భద్రాచలంకు చేరుకుంటుంది. ఈ పుణ్యయాత్రలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, స్వర్ణగిరి ఆలయం, వరంగల్ వేయి స్తంభాల గుడి, భద్రకాళి అమ్మవారి ఆలయం, రామప్ప దేవాలయంలను దర్శించవచ్చు.
టికెట్ ధరను పెద్దలకు రూ.1500, పిల్లలకు రూ.900గా నిర్ణయించారు.
ఇక అదే రోజు మరొక ప్రత్యేక బస్సు అన్నవరం, దాక్షారామం, వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం, ద్వారకా తిరుమల, మద్ది ఆంజనేయ స్వామి దేవాలయంలను దర్శించేందుకు కూడా ఏర్పాటుచేయనున్నట్లు డిపో మేనేజర్ తిరుపతి తెలిపారు.
వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు:
📞 855867140
📞 9063414561
📞 9959225987
భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.









