అశ్వాపురం మండల అభివృద్ధికి రూ. 95 లక్షల నిధులు – ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు హృదయపూర్వక ధన్యవాదాలు
అశ్వాపురం,ఆధాబ్ న్యూస్:
అశ్వాపురం మండలానికి అభివృద్ధి పనుల కోసం రూ. 95 లక్షల నిధులను మంజూరు చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు మండల ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
2023-24 ఎస్డిఎఫ్ నిధుల కింద రాష్ట్ర ప్రజాప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి రూ. 10 కోట్లను కేటాయించింది. ఈ నిధుల ద్వారా:
పాఠశాలలు, కళాశాలల మౌలిక సదుపాయాల కోసం – రూ. 2 కోట్లు
తాగునీటి అవసరాల కోసం – రూ. 1 కోటి
ప్రభుత్వ పరిపాలన కార్యాలయాల నిర్వహణ కోసం – రూ. 50 లక్షలు
మిగతా మొత్తం: గ్రామాలలో అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనుల కోసం వినియోగించబడుతుంది.
ఈ నిధుల కింద అశ్వాపురం మండలానికి ప్రత్యేకంగా రూ. 95 లక్షలు కేటాయించడమే నాయకుడు ప్రజల సంక్షేమం కోసం ఎంత కట్టుబాటుతో ఉన్నాడో స్పష్టం చేస్తుంది.
నిరంతరం ప్రజల పక్షాన నిలబడి నియోజకవర్గ అభివృద్ధికి శ్రమిస్తున్న నాయకుడికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
– తూము వీర రాఘవులు
అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ
ప్రధాన కార్యదర్శి









