ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పెద్దవంగర మండలంలో రోడ్డు ప్రమాదం సైకిల్‌పై వెళ్తున్న 12 ఏళ్ల బాలికను ఢీకొన్న టిప్పర్… ఘటనా స్థలంలోనే మృతి

పెద్దవంగర మండలంలో రోడ్డు ప్రమాదం
సైకిల్‌పై వెళ్తున్న 12 ఏళ్ల బాలికను ఢీకొన్న టిప్పర్… ఘటనా స్థలంలోనే మృతి
జయశంకర్ భూపాలపల్లి, ఆధాబ్ న్యూస్:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెద్దవంగర మండలంలో విషాదం చోటు చేసుకుంది. సైకిల్‌పై వెళ్తున్న 12ఏళ్ల బాలికను టిప్పర్ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది.

ఈ దుర్ఘటన ఆదివారం ఉదయం సుమారు 10:30 గంటల ప్రాంతంలో చిన్నవంగర గ్రామ సమీపంలోని కిష్టు తండా జాతీయ రహదారిపై జరిగింది. మృతురాలు జాటోత్ హిందూ (12)గా గుర్తించారు.

వారికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా వెలుగు చూడాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులు సేకరిస్తున్నారు. టిప్పర్ వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం వంటి కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రస్తుతం ఈ ఘటన తండా వాసుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!