ములకలపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ నిరసన
సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఇవ్వాలని, 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్
ములకలపల్లి,ఆధాబ్ న్యూస్:
ములకలపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాకు సాగునీరు అందించాలన్న డిమాండ్‌తో పాటు, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీగా తెలిపిన ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలంటూ తహసీల్దార్‌కు మెమోరాండం అందజేశారు.
ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపు మేరకు, నియోజకవర్గ ఇన్చార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ఆదేశాల ప్రకారం నిర్వహించబడింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మోరంపూడి అప్పారావు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అయినా ఒక్క గ్యారంటీ అమలుకానందం దురదృష్టకరం. రైతులకు సాగునీరు అందుతుందన్న హామీ జల్లెడలాగా మిగిలిపోయింది. గతేడాది ముఖ్యమంత్రి హంగు ఆర్భాటాలతో ప్రారంభించిన సీతారామ ప్రాజెక్టు నుంచి ఇప్పటివరకు ఒక్క ఎకరానికి కూడా నీరు చేరలేదు. ప్రభుత్వ మొండి వైఖరి కొనసాగితే, బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం దశలవారీగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుంది,”అని అన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో అనేకమంది పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా:
వగ్గెల పూజ, సున్నం నాగమణి (Ex జడ్పీటీసీ), మట్ల నాగమణి (Ex ఎంపీపీ), తాటి ప్రవీణ్ (యూత్ అధ్యక్షులు), తాండ్ర రాంబాబు, శనగపాటి సీతారాములు, బండి కొమరయ్య, పుష్పాల చందర్ రావు, తుర్రం శ్రీను, సున్నం బాబురావు, పూరేటి నర్సింహారావు, సూరం పుల్లారావు, తాటి రవి, భూక్యా ధర్మ, బజ్జురు కృష్ణ, బజ్జురు ఈశ్వరరావు, బొర్ర సుధాకర్, పద్దం వెంకటేష్, నునావత్ వీరన్న, గుగులోతు వీరన్న, పొక్కిలి రాజు, పత్తి బిక్షం, గోలముడి బాలకృష్ణ, గండూరి ప్రమోద్ కుమార్, తానం కృష్ణ, దారా పోతురాజు, సిద్ధల వెంకటేష్, పుష్పాల సాయి, వేముల సతీష్, బైటీ పొట్టి, యేసుపాక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.









