తహసీల్దార్‌కు మెమొరాండం అందజేసిన చర్ల మండల బీఆర్ఎస్ నాయకులు
చర్ల, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయానికి మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు, మండల కన్వీనర్ దొడ్డి తాతారావు నాయకత్వంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా తాతారావు మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు నీటిని ఖమ్మం జిల్లాకు తరలించడాన్ని తప్పుబట్టారు. ఖమ్మం జిల్లాకు సాగునీరు ఇవ్వడం సమంజసమే అయినా, భద్రాద్రి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల రైతులకు నీరు అందించకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం మేల్కొని తక్షణమే భద్రాద్రి జిల్లాకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా, హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 అంశాలను అమలు చేయలేదని విమర్శించారు. గ్యారెంటీ కార్డుల పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాగ్దానాలను అమలు చేయాలని, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాటాన్ని కొనసాగిస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులు:
మాజీ మండల అధ్యక్షుడు సోయాం రాజారావు
మాజీ ఎంపీపీ గీద కోదండ రామయ్య
మండల సీనియర్ నాయకులు సయ్యాద్ అజీజ్, ఎడ్ల రామదాసు
డివిజన్ యువజన నాయకుడు కాకి అనిల్
బీసీ సెల్ అధ్యక్షుడు గోరంట్ల వెంకటేశ్వర రావు
ST సెల్ కార్యదర్శి కారం కన్నారావ్
SC సెల్ అధ్యక్షుడు కొంబత్తిని రాము
యూత్ మండల అధ్యక్ష కార్యదర్శులు అంబోజి సతీష్, కుప్పల నిరంజన్
మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు కుప్పల సౌజన్య
ఇతర యువజన నాయకులు: కట్టాం కన్నారావు, తడికల బుల్లెబయి, మెడబత్తిని గోవర్ధన్, తోటపల్లి సాయి, కోటి శ్రీకాంత్, బట్ట కొమరయ్య, మునిగేలా సాంబ, తడికల చంద్రశేఖర్, గట్టుపల్లి రాజు, కారం రామారావు, గట్టుపల్లీ రామయ్య, మైపా వెంకటేశ్వర్లు తదితరులు.









