సుకుమాలో మావోయిస్టుల దాడి: ఎఎస్పీ ఆకాశవరావు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు. ఛత్తీస్గఢ్, ఆధాబ్ న్యూస్: డిస్క్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతమైన ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో మరోసారి మావోయిస్టులు హింసా ప్రవర్తనకు పాల్పడ్డారు. పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైస్)తో పేల్చడంతో ఘోర ప్రమాదం జరిగింది.
ఈ దాడిలో ఎఎస్పీ ఆకాశవరావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుంట డీఎస్పీ మరియు సీఐలకు తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మావోయిస్టుల ఈ దాడిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. శాంతి భద్రతల పరిరక్షణ కోసం అదనపు బలగాలను మోహరించినట్లు తెలుస్తోంది.









