ప్రతి క్షణం
ప్రజల పక్షం

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అదనపు డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌గా అశ్విని నియామకం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అదనపు డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌గా అశ్విని నియామకం

భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరోగ్య శాఖ మరింత పటిష్టంగా పనిచేయేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అశ్వినిని, అదనపు బాధ్యతలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నియమించారు.

పరిపాలనా అనుభవం, కట్టుదిట్టమైన తనిఖీలతో నిబంధనలు అమలులో అశ్వినికి మంచి పేరు ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలో ఆమె చేపట్టిన చర్యలు స్థానికంగా మంచి ప్రాభవం చూపించాయి. అక్రమ ఔషధ వ్యాపారాలపై ఆమె చేపట్టిన నిర్దాక్షిణ్య చర్యలకు మెచ్చిన ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ కొత్త బాధ్యతలు అప్పగించారు.

ఈ నియామకం నేపథ్యంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఔషధాల సరఫరా, నిల్వలు, నాణ్యత నియంత్రణపై మరింత పర్యవేక్షణ పెరగనుంది. ప్రజారోగ్య పరిరక్షణలో ఇది ఒక ముందడుగుగా భావిస్తున్నారు.

అశ్వినికి ఈ కొత్త బాధ్యతల్లో విజయాలు సాధించాలంటూ, స్థానిక వైద్య, ఆరోగ్య అభినందనలు తెలియజేస్తున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!