ప్రతి క్షణం
ప్రజల పక్షం

  గ్రామాల్లో ఏబిసిడి డ్రైవ్‌లు నిర్వహించాలి.జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాలు:

గ్రామాల్లో ఏబిసిడి డ్రైవ్‌లు నిర్వహించాలి.జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాలు:                               భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్;భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం అన్ని గ్రామాల్లో ఏబిసిడి డ్రైవ్‌లు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఏబిసిడి డ్రైవ్, భూభారతి రెవెన్యూ సదస్సులు, బక్రీద్ పండుగ ఏర్పాట్లు, ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక సరఫరా, బడిబాట గ్రామసభల నిర్వహణ మరియు వనమహోత్సవ ఏర్పాట్లపై టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఏబిసిడి డ్రైవ్ అంశాలు:

ఏ – అజొల్లా పెంపకం:
పశువులకు పోషకాహారం అందించేందుకు అజొల్లా సాగు ప్రోత్సహించాలని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ ఇంటి వద్దనే నిరుపయోగంగా ఉన్న డ్రమ్ములు, ట్యాంకుల్లో అజొల్లా సాగు చేపట్టేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

బి – బయోచార్:
గ్రామీణ ప్రాంతాల్లో బయోచార్ తయారు చేసి, వ్యవసాయంలో ఉపయోగించడం ద్వారా మట్టిలో జీవనశక్తి పెరిగి అధిక దిగుబడి సాధించవచ్చని, ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసేదన్నారు.

సి – కంపోస్టింగ్:
మట్టి ద్వారా ఇటుకలు తయారీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఇప్పటికే ఐదు యంత్రాలు అందుబాటులో ఉన్నాయని, ఇంకో ఐదు యంత్రాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అన్ని పాఠశాలల్లో ఇటుకలతో ప్రహరి గోడలు నిర్మించేందుకు ప్రోత్సహించాలని సూచించారు.

డి – డిగ్గింగ్ సోక్ పిట్:
వర్షాకాలంలో నీటి నిల్వకు కారణమయ్యే ప్రదేశాల్లో ఇంకుడు గుంతలు నిర్మించాల్సిన అవసరం, ప్రతి ప్రధాన రహదారులు, కార్యాలయాల్లో దీనిని చేపట్టాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఫ్ – పామ్ పౌండ్స్:
ప్రతి వ్యవసాయ క్షేత్రంలో పామ్ పౌండ్స్ నిర్మించి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇది ఉపయోగపడతుందని తెలిపారు.

భూభారతి రెవెన్యూ సదస్సులు:
వివిధ భూసంబంధి సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు అధికారులు సమన్వయం చేస్తుండాలని, సర్వే నెంబర్ల సమస్యలు, సమస్యల సంఖ్య, కారణాలు నమోదు చేయాలని ఆదేశించారు.

ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక సరఫరా:
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక సరఫరాను సమయానికి నిర్వహించాలని, ఎంపీడీవోలు తాసిల్దార్లకు నివేదికలు అందజేయాలని, రవాణా వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.

బడిబాట:
ప్రతి గ్రామంలో బడిబాట గ్రామసభలు నిర్వహించి విద్యార్థుల వివరాలు నమోదు చేయించి, మిడిల్‌లో చదువు మానిన పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలలకు చేర్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

బక్రీద్ పండగ ఏర్పాట్లు:
పండుగ సందర్భంగా ఎలాంటి సమస్యలు రాకుండా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి. ఎర్గాల వద్ద మౌలిక వసతులు, విద్యుత్ అంతరాయం రాకుండా చర్యలు తీసుకోవాలి. మసీదుల వద్ద పారిశుధ్య చర్యలు చేపట్టి చెత్త వేసే ప్రదేశాలను నియంత్రించాలి. తాగునీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.

వనమహోత్సవం:
జూలై 1 నుండి వనమహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటడానికి అనువైన ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి. ప్రజలకు ఉపయోగపడే మొక్కలు మాత్రమే నాటాలని, విస్తృతంగా వెదురు సాగును ప్రోత్సహించాలని, అన్నపురెడ్డిపల్లి గ్రామం వంటి ఆదర్శ గ్రామాల నుంచి పాఠం తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. అటవీ భూములను ఉపయోగించి పండుబడ్డ వ్యూహాలను సిద్ధం చేయడం అధికారుల బాధ్యత అని చెప్పారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!