ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు పారిశుధ్య కార్యక్రమం, ర్యాలీతో ప్రచారం – ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి: రేంజర్ తేజస్వి

ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు
పారిశుధ్య కార్యక్రమం, ర్యాలీతో ప్రచారం – ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి: రేంజర్ తేజస్వి

పినపాక ,ఆధాబ్ న్యూస్: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రేంజర్ తేజస్వి ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె నేతృత్వంలో ఒక జనజాగరణ ర్యాలీ చేపట్టారు. పెద్దమ్మ తల్లి ఆలయం పరిసరాల్లో పారిశుధ్య పనులు నిర్వహించడంతో పాటు ప్లాస్టిక్ కవర్లను సేకరించారు.

ఈ సందర్భంగా రేంజర్ తేజస్వి మాట్లాడుతూ, “పర్యావరణాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో కీలకం. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దాన్ని అభివృద్ధి చేయాలి. చెట్లను నరుకుతూ మనమే మన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నాం,” అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్వోలు గోవింద్, ఏడుకొండలు, వెంకటమ్మ, రామనాధం, సూరయ్య, బీట్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామస్థుల ప్రశంసలు అందుకుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!