రావికంపాడు గ్రామంలో డైరీల పంపిణీ కార్యక్రమం
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రావికంపాడు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు డైరీల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపాధ్యక్షులు గాలం రవి ఆధ్వర్యంలో పలువురు లబ్ధిదారులకు డైరీలు అందజేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కక్కర్ల వెంకటేశ్వర్లు, ఇమ్మడి వెంకటేశ్వర్లు, గౌడాస్, తీగల రమణయ్య, కుక్కల రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు గ్రామ అభివృద్ధికి పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
Post Views: 25









