విత్తనాల దుకాణాల్లో తనిఖీలు – నకిలీపై కఠిన చర్యలు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:కరకగూడెం మండల పరిధిలోని విత్తనాల వ్యాపార కేంద్రాల్లో నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అనే అంశంపై వ్యవసాయ శాఖ అధికారులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ అధికారి చటర్జీ, పోలీస్ ఎస్సై నాగేశ్వరరావు నేతృత్వంలో నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న రికార్డులను పరిశీలించారు.
విత్తనాల నిల్వలు, విక్రయ రిజిస్టర్లు, లైసెన్సులు వంటి వివరాలు పూర్తిగా పరిశీలించారు. నకిలీ విత్తనాల లేబుల్ సీల్ లేని విత్తనాలు అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వారు చెప్పారు.
ఈ సందర్భంగా వారు వ్యాపారులకు అవగాహన కల్పిస్తూ, నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని, నకిలీ విత్తనాలు అనుమానించినప్పుడు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.









