మూడు నెలల బియ్యం పంపిణీ ప్రారంభం: జిల్లా పౌరసరఫరాల శాఖ
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ షాపుల ద్వారా ఈసారి మూడు నెలల బియ్యం పంపిణీ ప్రారంభమైంది. జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి రుక్మిణీ దేవి ఆదివారం పలు రేషన్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, లబ్దిదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మొత్తం 17,287 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్‌ల నుండి చౌకధరల దుకాణాలకు దఫా వారీగా తరలించామని తెలిపారు.
ఈ నెల 30వ తేదీ వరకు బియ్యం పంపిణీ కొనసాగనుందని, డీలర్లు సమయపాలన పాటించాలని అధికారులూ హెచ్చరించారు. జిల్లాలోని మొత్తం 443 రేషన్ షాపులలో నేటి వరకు 32,488 మంది కార్డుదారులు బియ్యం తీసుకున్నట్టు డీసీఎస్ఓ పేర్కొన్నారు.
అధికారుల పర్యవేక్షణలో పంపిణీ ప్రక్రియ సజావుగా సాగుతున్నట్లు తెలుస్తోంది
Post Views: 31









