ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ గణేష్ – రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబాటు
జగిత్యాల జిల్లా,ఆధాబ్ న్యూస్: జిల్లాలోని రాయికల్ తాలూకా ఇన్ఛార్జి తహసీల్దార్ గణేష్ ఏసీబీకి పట్టుబడ్డారు. సింగర్రావుపేటకు చెందిన ఓ రైతు భూమి రిజిస్ట్రేషన్ పనికి గణేష్ రూ.15,000 లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా, అధికారులు బుధవారం ఏర్పాటు చేసిన ఫందాలో తహసీల్దార్ గణేష్ రూ.10,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
అధికారికంగా కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.
Post Views: 43









