తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కరకగూడెం పోలీస్ స్టేషన్లో జాతీయ పతాక ఆవిష్కరణ
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరకగూడెం పోలీస్ స్టేషన్లో ఎస్సై నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఘనంగా ఎగరవేశారు
ఈ సందర్భంగా ఎస్సై నాగేశ్వరరావు మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడిన మహానుభావులను మనం ఈ రోజు స్మరించుకోవాలి. వారి త్యాగాలతోనే ఈ రోజు మనకు ప్రత్యేక రాష్ట్రం దక్కింది. అందరికి తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజల సేవలో పోలీస్ విభాగం ఎప్పుడూ ముందుంటుంది,” అని తెలిపారు.
ఈ కార్యక్రమానికి పోలీస్ సిబ్బంది హాజరై జాతీయ గీతాన్ని ఆలపించి వేడుకలను మరింత ఉత్సాహభరితంగా తీర్చిదిద్దారు.
Post Views: 40









