ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెంలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రావుల సోమయ్య ఆధ్వర్యంలో జరిగింది. జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేశారు  తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీరులకు నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, సోషల్ మీడియా సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేడుకలు దేశభక్తితో, ఉద్యమ గౌరవంతో ఉత్సాహభరితంగా సాగాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!