ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ప్లాస్టిక్ వాడకం తగ్గించండి – పర్యావరణాన్ని పరిరక్షించండి

ప్లాస్టిక్ వాడకం తగ్గించండి – పర్యావరణాన్ని పరిరక్షించండి
పినపాక, ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పర్యావరణ వారోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా, సోమవారం రోజు కే. తేజస్వి (ఎఫ్‌ఆర్‌ఓ – ఏడూల్ల బయ్యారం) తమ సిబ్బందితో కలిసి జానంపేట గ్రామ సమీపంలోని ఆర్‌ఎఫ్ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకటేశ్వరరావు, ఎఫ్‌ఎస్‌ఓలు, ఎఫ్‌బి‌ఓలు, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు పౌరుల భాగస్వామ్యం అత్యంత అవసరమని వారు ఈ సందర్భంగా తెలిపారు.

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడమే ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకి పెట్టుబడిగా భావించాలి అని అధికారులు సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!