కరకగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలి. మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జూన్ 2న సోమవారం ఉదయం 9:00 గంటలకు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, బూత్ మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ తెలిపింది. తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్రను గుర్తుచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు సమాచారం.
Post Views: 35









