దశదినకర్మల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు.
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం, వెంకటపురం గ్రామానికి చెందిన పోలెబోయిన క్రిష్ణయ్య (హెల్త్ డిపార్ట్మెంట్ – కరకగూడెం) తండ్రి పోలెబోయిన ఎర్రసమ్మయ్య అనారోగ్యంతో మృతి చెందారు. శనివారం పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మరణించిన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ, దశదినకర్మల్లో పాల్గొన్నారు.
రేగా కాంతారావు మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు రావుల సోమయ్య, గ్రామ మాజీ సర్పంచ్ పోలెబోయిన పాపమ్మ, స్థానిక నాయకులు, కార్యకర్తలు ఇతరులతో పాటు పాల్గొన్నారు.
Post Views: 41









