అశ్వాపురం మండలంలో పుష్పాలంకరణ వేడుక – పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలోని కె.వి.ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం జరిగిన పుష్పాలంకరణ వేడుక ఘనంగా జరిగింది. యాడెల్లి శ్రీను–అలివేలు దంపతుల కుమార్తె వైష్ణవి పుష్పాలంకరణ కార్యక్రమానికి మాజీ పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వధువుకు అక్షింతలు వేసి ఆశీర్వచనాలు అందించారు.
వేదికపై అశ్వాపురం మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి, జాలే రామకృష్ణారెడ్డి, ఈదర సత్యనారాయణ, కుర్రి నాగేశ్వరరావు, నూకరపు రమేష్, ముద్దందుల కృష్ణ, చిలక వెంకటరమయ్య, చుంచు రామ్మూర్తి, వెంకటేశ్వర్లు, యువజన అధ్యక్షుడు గద్దాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి బూర్గంపాడు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుంపేనా శ్రీను, తూము చిన్న రాఘవులు, చావా వీర రాఘవులు, దావా వీరస్వామి, శివారపు డాక్టర్ బాబు, సోషల్ మీడియా అధ్యక్షుడు గజ్జి లోహిత్ యాదవ్, శేఖర్, అశోక్ తదితరులు హాజరయ్యారు.
వేదిక లో కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను మరింత వైభవంగా మార్చారు









