ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మణుగూరు ఓసి: గౌరవ్ ఇన్ ఫ్రా కంపెనీలో 80% ఉపాధి స్థానికులకు కల్పించాలి – కర్నే బాబురావు

మణుగూరు ఓసి: గౌరవ్ ఇన్ ఫ్రా కంపెనీలో 80% ఉపాధి స్థానికులకు కల్పించాలి – కర్నే బాబురావు
మణుగురు, ఆధాబ్ న్యూస్:

మణుగూరు ఓపెన్ కాస్ట్ (ఓసి) ప్రాజెక్టులో మట్టి తొలగింపు పనులను చేపట్టిన గుజరాత్‌కు చెందిన గౌరవ్ ఇన్ ఫ్రా అనే ఓబి కంపెనీలో 80 శాతం ఉపాధిని నిర్వాసితులు, స్థానికులు మరియు సింగరేణి డిపెండెంట్లకు కల్పించాలని సామాజిక సేవకులు కర్నే బాబురావు డిమాండ్ చేశారు.

ఈ మేరకు వారు ఏరియా ఎస్.ఓ టు జీఎం డి. శ్యాంసుందర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన కర్నే బాబురావు, “గౌరవ్ ఇన్ ఫ్రా సంస్థ సింగరేణి ప్రాజెక్టుల పనులు చేపట్టిన నేపథ్యంలో, సింగరేణి సిఎండీ ఎం. బలరాం జారీ చేసిన ‘80% ఉపాధి స్థానికులకు కల్పించాలి’ అనే ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలి” అని అన్నారు.

“ఇతర రాష్ట్రాల కార్మికులకు ముందస్తు అడ్వాన్స్‌లు ఇచ్చి ఉపాధి కల్పిస్తున్న కంపెనీలు, స్థానికులను మాత్రం విస్మరిస్తున్నాయి. ఇది బాధాకరం,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వోల్వో శిక్షణా కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించారని, ఇదే దిశగా ప్రస్తుతం పనిచేస్తున్న గౌరవ్, దుర్గా వంటి ఓబి కంపెనీల్లోనూ అదే నిబంధనల ప్రకారం 80% ఉపాధిని స్థానికులకే కల్పించాలని యాజమాన్యాన్ని కోరినట్లు చెప్పారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!