భద్రాద్రి కొత్తగూడెం: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ప్రయోగ పరీక్షలు ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యాలయం ప్రకారం, మే/జూన్ 2025 లో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలలో భాగంగా జనరల్ మరియు ఒకేషనల్ కోర్సులకు చెందిన ప్రయోగ పరీక్షలు ఈనెల 3వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.
పరీక్షలు జిల్లాలోని అన్ని కళాశాలల విద్యార్థుల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొత్తగూడెం లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు నాలుగు రోజులు పాటు, రోజుకు రెండు దఫాలుగా జరుగనున్నాయి. ఉదయం సెషన్ ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, మధ్యాహ్న సెషన్ మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 5:00 వరకు జరగనున్నాయి.
ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులకు ముఖ్య సూచన ఏమనగా – ఆయా విద్యార్థుల ప్రయోగ పరీక్షల హాల్ టికెట్లు వారి కళాశాల లాగిన్ లో పొందుపరచబడ్డాయి. అందులో ఉన్న టైమ్ టేబుల్ ప్రకారం విద్యార్థులు తప్పనిసరిగా ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొత్తగూడెం వద్ద హాజరుకావలసిందిగా అధికారులు తెలియజేశారు.
— ఇంటర్మీడియట్ విద్యాశాఖ, భద్రాద్రి కొత్తగూడెం









