పాల్వంచలో కాంగ్రెస్ గిరిజన ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ముగింపు సభకు ముఖ్య అతిథులుగా మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని స్పోర్ట్స్ కళాశాలలో నిర్వహించిన తెలంగాణ ఆదివాసి కాంగ్రెస్ బునియాడ కార్యకర్తల గిరిజన ఎంపవర్మెంట్ ట్రైనింగ్ సమ్మేళనం ముగింపు సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పిసిసి ఇన్చార్జి శ్రీమతి మీనాక్షి నటరాజన్ , టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ , నియోజకవర్గ నాయకుడు న్యాయవాది భజన సతీష్ ఆ ఇద్దరు నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు.
సభలో కరకగూడెం మండల నాయకులు మాజీ ఎంపీటీసీ బిజ్జా రామనాథం, మాజీ ఉపసర్పంచ్ కోరం వెంకటేశ్వర్లు, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగబండి వెంకటేశ్వర్లు, నాయకులు బరపాటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.









