అనంతారం మాజీ సర్పంచ్ దొంగరి సత్యనారాయణ సేవలు మరువలేనివి: రేగా కాంతారావు
దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న పినపాక మాజీ ఎమ్మెల్యే
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని అనంతారం గ్రామ పంచాయితి తొలి సర్పంచ్‌గా సేవలందించిన దొంగరి సత్యనారాయణ సేవలు మరువలేనివని పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు.
శనివారం అనంతారం గ్రామంలో నిర్వహించిన దొంగరి సత్యనారాయణ దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, మృతుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారి సంక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ, “సత్యనారాయణ గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలు గ్రామస్థుల హృదయాల్లో చెరిగిపోవు,” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









