తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ
భద్రాచలం,ఆధాబ్ న్యూస్: ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి సభ్యుడు, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాత మధుసూదన్ జన్మదినం సందర్భంగా భద్రాచలం మండలంలో ఘనంగా వేడుకలు జరిగాయి. మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్, కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు, సీనియర్ నాయకులు కొల్లం జయ ప్రేమ్ కుమార్, కొండవీటి థామస్, యువజన నాయకులు గోసుల వెంకట శ్రీనివాస్, శ్రీరంగం భార్గవ్, ఆటో యూనియన్ నాయకులు రావూరి రవి కిరణ్, మహిళా విభాగ నాయకులు ప్రియాంక, గోల గణేష్, విద్యార్థి విభాగ నాయకుడు హరి తదితరులు పాల్గొన్నారు.
తాత మధుసూదన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ అభివృద్ధిలో ఆయన పాత్రను కొనియాడారు.
Post Views: 43









