ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పొగాకు ప్రాణాంతకం, నిషేధించాలి: మణుగూరు జుడీషియల్ మెజిస్ట్రేట్ కంపాటి సూరి రెడ్డి

పొగాకు ప్రాణాంతకం, నిషేధించాలి: మణుగూరు జుడీషియల్ మెజిస్ట్రేట్ కంపాటి సూరి రెడ్డి
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
మణుగూరు స్థానిక డివి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నో టొబాకో డే కార్యక్రమం సందర్భంగా మణుగూరు ప్రథమ శ్రేణి జుడీషియల్ మెజిస్ట్రేట్ కంపాటి సూరి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ మాట్లాడుతూ, పొగాకు వాడకం ప్రాణాంతకమని, ఇది అనేక ప్రమాదకర వ్యాధులకు దారి తీస్తుందని స్పష్టంచేశారు. విద్యార్థులు, యువత, లారీ మరియు ఆటో డ్రైవర్లకు పొగాకు వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు.

పొగాకు వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు వంటి అనర్థాలు సంభవించవచ్చని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ పొగాకు వాడకాన్ని నిషేధించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వివిధ విద్యా సంస్థల విద్యార్థులు, డ్రైవర్లు, స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో పొగాకు నిర్మూలనపై శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని అందరూ గుర్తించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!