ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అర్ధరాత్రి మణుగూరు చేపల మార్కెట్‌లో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

అర్ధరాత్రి మణుగూరు చేపల మార్కెట్‌లో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మత్తు పదార్థాల మాయలో పడుతున్న యువతను పట్టించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న పోలీస్ శాఖ, తాజాగా చేపల మార్కెట్ పరిసరాల్లో ఓ యువకుడిని అదుపులోకి తీసుకుంది. ఆ యువకుడి వద్ద నుంచి ‘గమ్ ట్యూబ్’ వంటి వింతమైన మత్తు పదార్థం పట్టుబడింది.

ఈ ట్యూబ్‌ను కవర్లో వేసి శ్వాస ద్వారా పీల్చడం వల్ల విపరీతమైన మత్తు కలుగుతుందని పోలీసులు వెల్లడించారు. దీనికి బానిసలుగా మారుతున్న యువత, తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు స్పందించిన మణుగూరు సీఐ నాగబాబు మాట్లాడుతూ – “ఇది ఒక్క గంజా కాదు, గమ్ ట్యూబ్ ద్వారా సైతం యువత మత్తు వలయంలో చిక్కుకుంటున్నారు. మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి వాటిని విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అన్నారు.

పోలీసుల విజ్ఞప్తి – తల్లిదండ్రులు, గురువులు, సమాజం అందరూ కలిసి యువతను మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచేందుకు చొరవ చూపాలని కోరుతున్నారు. యువత భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఒక్కడిగా నిలవాలి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!