ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ! మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా అరెస్ట్.

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ!

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా అరెస్ట్.   కోరాపుట్, ఆధాబ్ న్యూస్:
ఒడిశాలోని కోరాపుట్ జిల్లా బైపరిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెటగూడ అటవీ ప్రాంతంలో, భద్రతా బలగాలు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కుంజం హిడ్మాను అరెస్టు చేయడంతో మావోయిస్టులకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది.
హిడ్మా పై రూ.14 లక్షల రివార్డ్

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో హిడ్మా నక్సల్ కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషిస్తూ పలుచోట్ల మృతి మూటలేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇతనిపై రూ. 14 లక్షల బహుమతిను భద్రతా బలగాలు ప్రకటించి ఉండటం విశేషం.చాకచక్యంగా చేపట్టిన ఆపరేషన్

దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఆపరేషన్ సమయంలో, పోలీసులు హిడ్మా వద్ద నుంచి

ఏకే-47 తుపాకీ,

బెదిరింపు లెటర్లు,

మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్యమైన పత్రాలు,

ఇతర కీలకమైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
భవిష్యత్తులో కీలక సమాచారం బయటపడే అవకాశం

హిడ్మా అరెస్ట్‌తో దేశవ్యాప్తంగా నక్సలైట్స్ చర్యలపై మరిన్ని కీలక సమాచారం వెలుగు చూసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఈ అరెస్ట్‌ను భద్రతా వ్యవస్థ విజయంగా భావిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!