మణుగూరు ట్రాఫిక్ సమస్యలపై సిఐ నాగబాబు అవగాహన
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
మణుగూరు పట్టణంలోని ప్రధాన కూడలిలో ఆటోలు ఇష్టారాజ్యంగా నిలిపి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని, ఈ తరహా చర్యలపై ఇకపై ఉపేక్షించబోమని సిఐ నాగబాబు హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు.
సురక్షిత రవాణా కోసం ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా అనుసరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రజల రాకపోకలకు అసౌకర్యం కలిగించే విధంగా వాహనాలను నిలిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆటో డ్రైవర్లు సమయానికి నిర్ణీత స్థలాల్లో వాహనాలను నిలపాలని సూచించారు.
అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, స్థానిక డ్రైవర్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Post Views: 40









