వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని తాటిగూడెం గ్రామంలో కొమరం నర్సింహారావు, జయ దంపతుల రెండోవ కుమారుడు అనిల్ కుమార్ మరియు దేవి వివాహ వేడుకలో పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్థానిక నాయకులతో కలిసి హాజరయ్యారు.
వధూవరులను ఆశీర్వదించిన సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
Post Views: 33









