ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మణుగూరులో వరుస దొంగతనాలపై పోలీసు చర్యలు తీసుకోవాలని వినతి: ఎస్పీ రోహిత్ రాజ్ కు వినతిపత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు

మణుగూరులో వరుస దొంగతనాలపై పోలీసు చర్యలు తీసుకోవాలని వినతి: ఎస్పీ రోహిత్ రాజ్ కు వినతిపత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు

భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్: మణుగూరులో వరుస దొంగతనాలు కార్మికులు, ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయని, వెంటనే పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టాలని సామాజిక సేవకులు కర్నే బాబురావు కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఖమ్మం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కర్నే బాబురావు మాట్లాడుతూ, పివి కాలనీలో సుమారు ఏడున్నర క్వార్టర్లలో దొంగలు హల్‌చల్ చేసినట్టు తెలిపారు. బంగారం, వెండి ఆభరణాలు, నగదు వంటి విలువైన వస్తువులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరిగినట్లు చెప్పారు. బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నాయని తెలిపారు.

దొంగతనాలపై ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించి బాధితులకు ధైర్యం చెప్పాలని కోరారు. అలాగే, విలువైన వస్తువులు కోల్పోయిన కార్మికులకు న్యాయం చేయాలని, దొంగతనానికి సంబంధించి సొత్తును రికవరీ చేసి వారికి తిరిగి అందించాల్సిన అవసరం ఉందన్నారు.

కాలనీలో సీసీ కెమెరాలను పూర్తిస్థాయిలో క్రియాశీలంగా ఉంచాలని, సంత, ఇతర ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను విస్తరించాలన్నారు. కార్మిక వాడల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు సందర్శకులపై సింగరేణి సెక్యూరిటీ విభాగం ద్వారా నిఘా పెట్టాలని సూచించారు.

పివి కాలనీలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌ను పునరుద్ధరించాలని, కాలనీలో పోలీసు పెట్రోలింగ్ పెంచాలని మరియు అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!