ప్రతి క్షణం
ప్రజల పక్షం

  రూ.4.15 కోట్ల విలువైన గంజాయి పట్టివేత: జూలూరుపాడు మండలంలో 9 మందిపై కేసు నమోదు

రూ.4.15 కోట్ల విలువైన గంజాయి పట్టివేత: జూలూరుపాడు మండలంలో 9 మందిపై కేసు నమోదు
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలంలోని పడమట నర్సాపురం గ్రామంలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. అక్రమంగా గంజాయి తరలిస్తున్న మినీ కంటైనర్‌ను జూలూరుపాడు పోలీసులు మరియు సిసిఎస్ బృందం సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీలలో పట్టుకున్నారు.

పోలీసుల చెబుతునట్లు, మినీ కంటైనర్‌లో దాచి ఉంచిన 8 కిలోల 300 గ్రాముల గంజాయిను గుర్తించారు. దీని విలువ సుమారు రూ.4.15 కోట్లుగా అంచనా వేయబడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది నిందితులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

వివరాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మీడియాకు వెల్లడించారు. అక్రమ రవాణాను అరికట్టే క్రమంలో పోలీసులు చేపట్టిన ఈ చర్యలను ఆయన ప్రశంసించారు. గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, ఎవరెవరితో కలిసి ఈ అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు.

ఈ ఘటన జిల్లాలో ఉలిక్కిపడేలా చేసింది. గంజాయి రవాణాపై నిరంతర నిఘా కొనసాగుతుందని, నేరాలలో పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!