ప్రతి క్షణం
ప్రజల పక్షం

  రైల్వే ట్రాక్ భూములు కోల్పోయిన 24 మందికి నష్టపరిహార చెక్కుల పంపిణీ – పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

రైల్వే ట్రాక్ భూములు కోల్పోయిన 24 మందికి నష్టపరిహార చెక్కుల పంపిణీ – పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మణుగూరు, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం “ప్రజా భవన్” నందు ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రైల్వే ట్రాక్ నిర్మాణంలో భూములు కోల్పోయిన 24 మంది భూ నిర్వాసితులకు రూ. 1.32 కోట్ల విలువైన నష్టపరిహార చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మణుగూరు ఎమ్మార్వో అద్దంకి నరేష్ మాట్లాడుతూ – “గతంలో రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన కుటుంబాలకు ప్యాకేజ్ ప్రకటించినప్పటికీ, 24 మంది లబ్ధిదారులకు పలు కారణాలవల్ల పంపిణీ ఆలస్యం అయింది. వారు ఎమ్మెల్యేను సంప్రదించగా, వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో చర్చించి సర్వేలు చేయించి, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. ఈ కుటుంబాల ఒక్కొక్కరికి రూ. 5.50 లక్షల చొప్పున నష్టపరిహారం మంజూరు కావడం ఎంతో హర్షణీయమైంది” అని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ – “ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కారానికి కృషి చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి పేద కుటుంబానికి చేరుస్తాను” అని చెప్పారు.

లబ్ధిదారులు మాట్లాడుతూ – “మా సమస్యను వెంటనే స్పందించి మంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసిన ఎమ్మెల్యేకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మణుగూరు ఎమ్మార్వో అద్దంకి నరేష్, మణుగూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిరినకి నవీన్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తరుణ్ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు శివ సైదులు, మహిళా అధ్యక్షురాలు సౌజన్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సతీష్, శివాలయం చైర్మన్ కూచిపూడి బాబుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!