ప్రతి క్షణం
ప్రజల పక్షం

  రెండు రోజుల్లో ‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

రెండు రోజుల్లో ‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను రెండు రోజుల్లో ‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. మంగళవారం ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దరఖాస్తుల పరిశీలన, ఇంకుడు గుంతల నిర్మాణం, బయోచార్ ఎరువుల తయారీపై సమీక్ష చేశారు.

కలెక్టర్ , గ్రామ, మండల, జిల్లాస్థాయిల్లో 50,000 నుండి 4 లక్షల రూపాయల రుణసహాయ దరఖాస్తులను స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలతో అర్హుల జాబితా రూపకల్పన చేస్తూ, త్వరగా పరిశీలించాలన్నారు. రానున్న రెండు రోజుల్లో ఈ పనిని పూర్తి చేసి తక్షణమే అర్హుల జాబితాను విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఇంకా, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన మిగిలి ఉన్న వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

జల్ సంచయ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇంకుడు గుంతల నిర్మాణాలు

జిల్ సంచయ్ జన్ భాగీ దారి కార్యక్రమం మేరకు జిల్లావ్యాప్తంగా భారీగా ఇంకుడు గుంతలు నిర్మించామని కలెక్టర్ చెప్పారు. ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో ఫామ్ పౌండ్స్ నిర్మాణంపై అవగాహన కల్పించి, రానున్న వర్షాకాలంలో ఒక్క చుక్క వర్షపు నీరు కూడా వృధా కాకుండా భూగర్భ జలాలను పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నిర్మించిన ప్రతి ఇంకుడు గుంత చుట్టూ జూన్ నెలలో ప్లాంటేషన్ నిర్వహించాలని, ముఖ్యంగా చెట్టు గానుగ, మందారం వంటి మొక్కలను నాటాలని అధికారులకు ఆదేశించారు.

బయోచార్ ఎరువుల తయారీపై అవగాహన

రైతులకు బయోచార్ తయారీ, దాని ప్రయోజనాల గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. గుంతలో చెక్క, ఆకులు కాల్చి, ఆ బొగ్గును ఆవు మూత్రం మరియు పేడలో రెండు నెలలపాటు ఉంచితే సద్గుణం కలిగిన ఎరువు తయారవుతుందని వివరించారు. ఇది భూమిని సారవంతం చేస్తూ, రసాయనాల అవసరం లేకుండా ఎక్కువ దిగుబడి సాధించడంలో సహాయపడుతుందని అన్నారు.

మండల, పంచాయతీ అధికారులకు వారి పరిధిలోని ఓపెన్ ప్లాట్లలో ఉన్న చెట్లు తొలగించి జామాయిల్ మొక్కలు నాటాలని సూచించారు. దీని వల్ల మరుగు, పారిశుధ్య కార్మికుల పని తగ్గుతుందని తెలిపారు. అలాగే, పడిపోయిన చెట్లను ఉపయోగించి బయోచార్ పద్ధతిలో ఎరువులు తయారు చేసి, రైతులకు తక్కువ ధరలో అందించవచ్చని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!