పినపాకలో హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశం – ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరులోని ప్రజా భవన్లో హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై మండలాల వారీగా సమీక్షిస్తూ, గ్రౌండింగ్, బేస్మెంట్, మార్క్అవుట్, రీ-వెరిఫికేషన్ తదితర అంశాలపై అధికారులను ప్రశ్నించారు.
నిర్మాణ పనులు వేగంగా పూర్తి కావడానికి లబ్ధిదారులను ప్రోత్సహించాలని, తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణ విధానం గురించి వారికి అవగాహన కల్పించాలన్నారు. నిర్మాణ దశల ప్రకారం వివరాలను ఆన్లైన్ యాప్లో నమోదు చేయాలని, ప్రభుత్వం అందించే సహాయం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 61









