గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లుల చెల్లింపు – రూ.153 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం కీలక చర్య తీసుకుంది. బుధవారం ఒక్కరోజే 9,990 బిల్లులను క్లియర్ చేస్తూ రూ.153 కోట్లు విడుదల చేసింది.
ప్రభుత్వం ఈ విడతలో రూ.10 లక్షల లోపు బిల్లులకు ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా 2024 ఆగస్ట్ వరకు పెండింగ్‌గా ఉన్న బిల్లులను చెల్లించేందుకు ప్రాధాన్యతనిచ్చింది.
SDF కింద చేపట్టిన అభివృద్ధి పనులకే రూ.85 కోట్లు మంజూరు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పనులు వేగంగా పూర్తి అయ్యేందుకు ఈ చర్య తోడ్పడనుంది.
Post Views: 69









