పినపాకలో టిడిపి నేతల మొక్కు చెల్లింపు – సమ్మక్క సారలమ్మ గుడిలో ప్రత్యేక కార్యక్రమం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: పినపాక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు మొక్కు చెల్లింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ నాయకురాలు తాతా మాధవి లత నేతృత్వంలో ఈ కార్యక్రమం సమ్మక్క సారలమ్మ ఆలయంలో నిర్వహించబడింది.
గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడును అకారణంగా అరెస్టు చేసిన సమయంలో ఆయన శుభప్రదంగా జైలు నుండి విడుదల కావాలన్న తలంపుతో పలు ప్రాంతాల్లో పూజలు, మొక్కులు వేయడం జరిగింది. పినపాక నియోజకవర్గం రంగాపూర్ సమీపంలోని సమ్మక్క సారలమ్మ గుడిలో కూడా పార్టీ కార్యకర్తలు విముక్తి కోసం మొక్కు వేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నేపథ్యంలో, ఆలస్యమైనా ఆ మొక్కు చెల్లించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చందా మధు, పసునూరి సీతమ్మ, పురిటి విజయలక్ష్మి, వీరయ్య, రాధాకృష్ణ, మేదరమెట్ల శ్రీనివాసరావు, సంఘ సుబ్బారెడ్డి, ధర్మరాజుల శంకర్, నాగేశ్వరరావు, లలిత, జయ, భవాని తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, “తెలుగుదేశం పార్టీ పినపాక నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులతో మరింత బలపడాలని తల్లులను ప్రార్థించాం,” అని పేర్కొన్నారు.









