మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో హతం
ఇప్పటి వరకు మావోయిస్టు చరిత్రలో ఇంత పెద్ద నేత మృతిచెందడం ఇదే తొలిసారి – అమిత్ షా
ఆధాబ్ న్యూస్, నెట్ వర్క్:
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతిచెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా ధృవీకరించారు. మావోయిస్టు పార్టీ చరిత్రలో ఇంతటి ప్రాముఖ్యత కలిగిన నేత హతమవడం ఇదే తొలిసారని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇదే సమయంలో, మావోయిస్టులపై కొనసాగిస్తున్న కఠిన చర్యల ఫలితంగా ఇప్పటివరకు 54 మంది అరెస్టు, 84 మంది లొంగుబాటు జరిగాయని అమిత్ షా వెల్లడించారు.
2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే మా లక్ష్యం,” అని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు.
గతంలో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ వంటి కీలక చర్యలు మావోయిస్టులపై ప్రభావం చూపాయని, భద్రతా బలగాల సాహసం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని అమిత్ షా పేర్కొన్నారు. కాగా, మృతిచెందిన నంబాల కేశవరావు మావోయిస్టు కేంద్ర కమిటీ కీలక నేతగా పనిచేస్తూ పలు రాష్ట్రాల్లో ఉన్నదగ్గిన కార్యకలాపాలకు పాల్పడినట్టు సమాచారం.









